2.0 – 2 days collections, 100 crores crossed


2.0 – 2 days collections, 100 crores crossed…. 2.0 చిత్రం బాక్సాఫీసు స్పీడుగా దూసుకెళుతోంది. రెండ‌వ రోజు క‌లెక్ష‌న్లు వంద కోట్లు దాటాయి. విడుద‌లైన మొద‌టి రోజు 2.0 మొత్తం 73.5 కోట్లు రాబట్టగా. రెండ‌వ రోజు కేవ‌లం హిందీలోనే 38.25 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో రెండ‌వ రోజు క‌లెక్ష‌న్లు 111.5 కోట్ల‌కు చేరుకున్న‌ది. రెండ‌వ రోజు క‌లెక్ష‌న్ల‌లో త‌మిళ‌, తెలుగు వ‌ర్షెన్ల వ‌సూళ్ల‌ను క‌ల‌ప‌కుండానే వంద కొట్లపైన వచ్చాయి.

ఓవ‌ర్‌సీస్‌లోనూ 2.0 ఫిల్మ్ మెరుగైన క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టుతోంది. యూఎస్‌లో మొద‌టి రోజు 2.05 కోట్లు వ‌సూల్ చేసింది. ఆస్ట్రేలియాలో 58.46 ల‌క్ష‌లు, న్యూజిలాండ్‌లో 11.11 ల‌క్ష‌లు వ‌సూల‌య్యాయి. రోబోకు సీక్వెల్‌గా వ‌చ్చిన 2.0 సైన్స్ థ్రిల్ల‌ర్‌ను శంక‌ర్ డైర‌క్ట్ చేశాడు. 543 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *