Anasuya Rangasthalam Character Look

Anasuya Rangasthalam Character Look

ప‌సుపు చీర‌లో రంగ‌మ్మ‌త్త అదుర్స్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వస్తున్న సినిమా ‘రంగస్థలం’. పూర్తి పల్లెటూరు నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే భారీ అంచనాల నడుమ తెరకెక్కింది. చిత్రంలో అనసూయ రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించ‌నుంది. తాజాగా ఆమె స్లిల్ ఒకటి బయటకు వదిలింది చిత్రయూనిట్.

ఇప్పటికే విడుదలైన సమంత, రామ్‌చరణ్ లుక్స్ సినిమాపై సినిమాపై ఓ రేంజ్ అంచానాలు క్రియేట్ చేయగా.. తాజాగా వచ్చిన అనసూయ రంగమ్మత్త అదిరిపోయే గెట‌ప్ లో క‌నిపించింది. ప‌సుపు చీర‌..న‌ల్ల జాకెట్.సిగ‌లో బంతె పువ్వు..ముక్కు పుడ‌క‌..నుదిటిన రూపాయి బిళ్లంత బొట్టు.కాళ్ల‌కు ప‌ట్టీలు..పాదాల‌కు ప‌సుపు. ఆ కోర చూపు.మ‌ట్టి మెట్ల‌పై ఆ వ‌య్యారం అద‌రింది క‌దూ! ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో జోరుగా వైల‌ర్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *