KTR Meet with Hon’ble Commerce Minister Suresh Prabhu

KTR Meet with Hon’ble Commerce Minister Suresh Prabhu.

Met with Hon’ble Commerce Minister Suresh Prabhu Ji to follow up on pending proposals. Sought support for Hyderabad pharama city, sanction of a mega leather park, several industrial corridors, Dry port & Spice park

Invited Hon’ble Minister to be Guest of Honour at BioAsia: The Global Biobusiness Forum : KTR

కేంద్రమంత్రి శ్రీ సురేశ్‌ప్రభుతో మంత్రి శ్రీ కేటీఆర్ సమావేశం అయ్యారు . అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టానికి మెగా లెదర్ పార్కు కేటాయించాలని సురేశ్‌ప్రభును కోరినట్లు చెప్పారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వడంతోపాటు ఫార్మాసిటీ అభివృద్ధికి రూ.1500 కోట్లు ఇవ్వాలని కోరామన్నారు.

టీఎస్‌ఐపాస్‌కు వస్తున్న సానుకూల స్పందనను సురేశ్‌ప్రభుకు తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 22, 23న బయో ఆసియా సదస్సు జరుగనున్న నేపథ్యంలో..ఈ సదస్సుకు హాజరు కావాలని సురేశ్‌ప్రభును ఆహ్వానించినట్లు వెల్లడించారు.నిజామాబాద్ స్పైస్ పార్క్‌కు రూ.20 కోట్లు ఇస్తామన్నారు. సురేశ్‌ప్రభుతో పారిశ్రామిక కారిడార్ అంశంపై చర్చించాం. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons