Mammootty – After 21 Years Telugu Film

Mammootty - After 21 Years Telugu Film
Mammootty – After 21 Years Telugu Film

Mammootty – After 21 Years Telugu Film.. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ని చిత్రము గా మమమ్మూట్టి వైస్ పాత్రలో నటిస్తున్న చిత్రం యాత్ర . మహి. వి.రాఘవ్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మమ్ముట్టి మాట్లాడుతూ తెలుగులో నేను నటించిన మూడవ సినిమా ఇది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నాను. 21 ఏళ్ల తరువాత తెలుగులో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగు భాషను పిలుస్తారు. రాజశేఖరరెడ్డి జీవితంలో చేసిన పాదయాత్రకు సంబంధించిన కథ ఇది. సినిమా ప్రారంభానికి ముందే డైలాగ్‌లు నేర్చుకున్నాను. తప్పులున్నా సరిచేసుకుని నటించాను. నాతో సినిమా తీసిన శ్యామ్‌దత్ ఈ చిత్ర కథ గురించి చెప్పారు. ఎంతో మంది వైఎస్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారు. అయనను ప్రేమించిన దానిలో నన్ను ఒక శాతం అయినా ప్రేమిస్తే చాలు అన్నారు మమ్ముట్టి.
దర్శకుడు మాట్లాడుతూ మమ్ముట్టిగారికి నేను ఎప్పటికీ రుణపడి వుంటాను. ఈ సినిమాలో చూసిన యాక్టింగ్ ఆయన గొప్పదనమే. ఓ మెంటర్‌లా నన్ను నడిపించారు. సినిమా అనేది టీమ్ అందరికి సంబంధించిన వర్క్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons