Nani’s 24th film to be directed by Vikram K Kumar

Nani's 24th film to be directed by Vikram K Kumar
Nani’s 24th film to be directed by Vikram K Kumar… నేచుర‌ల్ స్టార్ నాని 24వ సినిమాను ప్ర‌క‌టించేశారు. `13బి`, `ఇష్క్`, `మ‌నం`, `24`, `హ‌లో` చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి.. సెన్సిబుల్‌, స‌క్సెస్‌ఫుల్ డైర‌క్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న విక్ర‌మ్ కె కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. `శ్రీమంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్‌`, `రంగ‌స్థలం`… వ‌రుస‌గా సెన్సేష‌న‌ల్ హిట్స్ తో హ్యాట్రిక్ అందుకున్న భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. న‌వీన్ యెర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి (సీవీఎం) ఈ సినిమాకు నిర్మాత‌లు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది..

నేచుర‌ల్ స్టార్ నాని, విక్ర‌మ్ కె కుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్ అన‌గానే ఇటు చిత్ర‌వ‌ర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్ట‌ర్‌లో ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు..

“నాని ట్విట్ట‌ర్ లో “నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో. గ‌ర్ల్స్!! దిస్ ఒన్స్ ఫ‌ర్ యు “ అని పోస్ట్ చేశారు”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *