Peta producer Ashok Vallabhaneni interview

Peta producer Ashok Vallabhaneni interview
Peta producer Ashok Vallabhaneni interview

రజనీకాంత్ నటిస్తున్న త్వరలో రాబోతున్న చిత్రం పెట్టా. తెలుగులో పేట పేరుతో విడుదల చేస్తున్నారు ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని నిర్మాణంలో విడుదల చేస్తున్నారు. అశోక్‌ వల్లభనేని ఇంటర్య్వూ.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా విడుదల చేయడం ఎలా ఉంది?

సూపర్ స్టార్ గా ఎదిగిన బస్ కండక్టర్ త్వరలో రాజకీయాల్లో కి వస్తారని అంటున్నారు. రజినీకాంత్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగడం వల్లే ఈరోజు వారితో సినిమా చేయగలుగుతున్నాను.

తమిళ ప్రజలకు ఎంతో మేలు చేసిన రజినీకాంత్ గారు రేపు 6న రిలీజ్ ఫంక్షన్ లో ఇక్కడి అనాథ శరణాలయాలకు రజినీకాంత్ గారి చేతుల మీదుగా ప్రోత్సాహాన్ని అందించనున్నారు.

పేట తెలుగు రైట్స్ పొందడం ఎలా అనిపిస్తోంది?

నవాబ్, సర్కార్ చిత్రాలు విడుదల చేశాను.వాటి తర్వాత తెలుగులో ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ ద్వారా పేట తెలుగు హక్కులు పొందాను. అందుకు సన్ పిక్చర్స్ సంస్థ కృతజ్ఞతలు.

కార్తీక్ సుబ్బరాజ్ గురించి?

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రజినీకాంత్ గారిని కొత్త తరహాలో చూపిస్తూ హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారు. రజినీకాంత్ లుక్స్, నడక, స్టైల్, అన్ని మరింత కొత్తగా కనిపించనున్నాయి.

పాటల గురించి?

అనిరుద్ రవిచం దర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. డేటా సినిమాకు తగ్గట్లుగా వెర్సటైల్ మ్యూజిక్ ఇచ్చారు.

సినిమా ఎలా ఉండబోతోంది?

స్టోరీ గురించి చెప్పలేను కానీ రజినీకాంత్ గత చిత్రాలతో పోల్చితే పేట నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పగలను. వేట అంటే ఒక ప్రాంతం లేదా ఏరియా అని అర్థం

మీ బ్యానర్లో సినిమా ఎప్పుడు చేస్తారు?

ఇప్పటివరకు కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేశాను. 2019లో సొంతంగా సినిమా చేయాలనుకుంటున్నాను అందుకు కొన్ని కథలు హీరో దొరకగానే సినిమాని అనౌన్స్ చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons