Rajini, Akshay, Shankar’s 2.O Review

Rajini, Akshay, Shankar's 2.O Review
Rajini, Akshay, Shankar’s 2.O Review

న‌టీన‌టులు: రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్, కళా భవన్ సహజన్, రియాజ్ ఖాన్, ఆదిల్ హుస్సేన్, సుదాంశు పాండే
సంగీతం : ఏ.ఆర్ రెహమాన్
ఫోటోగ్రఫీ : నీరవ్ షా
నిర్మాత : లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం : శంకర్

కథ :
మనుషుల చేతిలో ఉండే సెల్ ఫోన్లన్నీ మాయమైపోయి. .. జనం అయోమయంలో ఉండగానే పక్షి రాజు (అక్షయ కుమార్) తన ఫిఫ్త్ ఫోర్స్ తో ఎంట్రీ ఇచ్చి విధ్వంసం సృష్టిస్తుంటాడు. అతన్ని ఆపడానికి సైంటిస్ట్ వశీకర్ తన హ్యుమనాయిడ్ రోబోట్ చిట్టీని దింపుతారు. మరి చిట్టీ భయంకరమైన పక్షి రాజును ఎలా ఎదుర్కొన్నాడు… పక్షి రాజు ఎవరు అనేదే సినిమా.

విశ్లేషణ :
రజినీకాంత్ కి ఉన్న ప్రపంచ వ్యాప్త అభిమానులకు, అంతకు తగ్గట్టుగానే శంకర్ 2. 0ని రూపొందిచాడు . నాలుగేళ్లుగా తీసుకున్న సమయం సినిమా చూస్తే అర్ధం అవుతుంది. సాంకేతికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులకి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. డైరెక్టర్ శంకర్ తీసిన అన్ని సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో సెల్ ఫోన్ మానవులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పే కథ. ఇప్పటి వరకు వచ్చిన కథలలో ఇది భిన్నమైన కథ. మొదటి భాగం మొత్తం పక్షి రాజు విధ్వంసంతో ఉత్కంఠభరితంగా సాగగా సెకండాఫ్లో చిట్టి ఎంట్రీ ఇచ్చి ఆ పక్షి రాజుతో తలపడటం మొదలయ్యాక సినిమా తారాస్థాయికి చేరుకుంటుంది. అత్యంత కీలకమైన అక్షయ్ కుమార్ ఫ్లాష్ బ్యాక్ భావోద్వేగానికి గురిచేస్తుంది. సినిమాలో ఆక్షన్ పార్ట్ మొత్తం ఇప్పటి వరకు చూడని విధంగా ఉంటుంది. అదేవిదంగా 3డి లో పూర్తి సినిమా చేయడం ఇదే మొదటిది.

నటీనటులు :
రజినీకాంత్.. చిట్టి అప్డేటెడ్ వెర్షన్ 2. 0 పాత్ర బాగా ఆకట్టుకునేల ఉంటుంది. అక్షయ్ కుమార్ అద్భుతమైన నటన కనబర్చారు. పక్షి రాజు పాత్ర హైలెట్ గా నిలిచింది. హీరోయిన్ ఆమీ జాక్సన్ పాత్ర కూడా సినిమాకి ముఖ్య పాత్రే. అక్షయ్ కుమార్ కాస్మొటిక్ మేకప్ వేసుకొని చేయడం చాల కష్టమైంది . అయినా అక్షయ్ నటనలో ఎక్కడ తగ్గకుండా కనబడతాడు. అమీ జాక్సన్ కూడా స్టోరీకి తగ్గట్టు వేషధారణతో, నటనలో కష్టపడింది ఇతర తారాగణం అంత బాగా నటించారు. .

సాంకేతిక వర్గం :
శంకర్ ఎంచుకున్న లైన్ ప్రకారం.. సాంకేతికంగా పరిజ్ఞానంతో చూపించిన విధానమే మొత్తంగా సినిమాని చూపిస్తుంది. సాంకేతిక విభాగం, విఎఫ్ఎక్స్ టీమ్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే. విజువల్స్ ఇండియన్ సినిమా మేకింగ్ స్థాయి వంద రేట్ల కి పెరిగిందనే చెప్పాలి. ఆక్షన్ సన్నివేశాలతో పాటు పాటల విజువల్స్ బాగా ఆకట్టుకునేలా చేసారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా విజువల్స్ కు తగ్గ మ్యూజిక్ ఇచ్చాడు . ఆంథోనీ ఎడిటింగ్, నీరవ్ షా సినిమాటోగ్రఫీ సరిగ్గా కుదిరాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఎక్కడా వెనుకాడకుండా ఒక గొప్ప సినిమాను అందించాలనే ఉద్దేశ్యంతో వందల కోట్లలో డబ్బును ఖర్చు పెట్టడం సినిమాలపై వారికున్న అభిరుచిని, గౌరవాన్ని గుర్తుచేస్తాయి. హాలీవుడ్ స్థాయిలో పుర్తి గా 3డి లో చిత్రీకరించిన  క్రెడిట్  శంకర్ కి మాత్రమే చెందుతుంది.

పాజిటివ్ పాయింట్స్ :
శంకర్ స్టోరీ లైన్
విజువల్ ఎఫెక్ట్స్
రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటన
యాక్షన్ దృశ్యాలు

నెగెటివ్ పాయింట్స్:
ఫ్లాష్ బ్యాక్ మినహా ఎమోషనల్ ఎపిసోడ్స్ లేకపోవడం

ఒక్క మాటలో:  అద్భుత దృశ్యం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons