Yatra first ticket sold for 6116 dollars

Yatra first ticket sold for 6116 dollars

Yatra first ticket sold for 6116 dollars…దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యాత్ర. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది.
ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికున్న క్రేజ్ ఏంటో తెలిసింది. ఇటీవలే ప్రీమియర్ షో మొదటి టికెట్ ను సీటెల్ లో వేలం వేశారు. 70ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, నిర్వాణ సంస్థలు అమెరికాలో సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్‌ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. ఈ వేలంలో మునీశ్వర్‌ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. అయితే $12 విలువ చేసే టికెట్‌ను అతనికి అందించి.. మిగతా డబ్బులను వైఎస్సార్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తామని నిర్మాతలు తెలిపారు. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons